శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గురువారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అఖల్ గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (Unable To Sleep) నిరంతర కాల్పులు, బాంబుల మోత కారణంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని, రాత్రివేళ తాము నిద్రపోలేకపోతున్నామని, రేషన్ కూడా నిండుకున్నదని, తాగు నీరు లేదని వాపోయారు.
కాగా, నంబర్దార్, చౌకీదార్ వంటి గ్రామ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. నంబర్దార్ తన ఇంట్లోని రేషన్ కూడా ప్రజలకు ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన కూడా ఆహారం కొరత ఎదుర్కొంటున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో రేషన్ కొరతను పరిష్కరించాలని, గ్రామస్తులకు తాగునీరు, మందులు అందించాలని గ్రామ అధికారి షేక్ మెహబూబ్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి తమను తరలించాలని అఖల్ గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read:
Fadnavis-Shinde Rift Buzz | ఫడ్నవీస్, షిండే మధ్య విభేదాలు?.. ఒకే పదవికి రెండు నియామకాలు
Disguised As Sadhu, Man Kills Wife | పదేళ్ల తర్వాత సాధువు వేషంలో వెళ్లి.. భార్యను చంపిన వ్యక్తి
Watch: మాజీ డిప్యూటీ సీఎం ఇంటి నుంచి.. ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీ చేసిన దొంగ