‘విద్యార్థులకు ఏ చిన్న సాయమైన సమాజ అభివృద్ధికి పెద్ద అడుగు’
విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు..
– హెచ్ఎం బివిఎల్ కుమార్
రుద్రంపూర్, మార్చి 11 : విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంలో అవసరమైన ప్యాడ్లు, స్కేల్స్, పండ్లను జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బోగ ప్రసాద్ సౌజన్యంతో నిర్వహించబడింది. మున్సిపల్ కార్పొరేషన్ 53వ వార్డు పరిధిలోని మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బివిఎల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్న బోగ ప్రసాద్, షేఖ్ అబ్దుల్ బాసిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. దేవుడు ఇచ్చిన దాంట్లో పేదవారి హక్కు కూడా ఉందని, ముఖ్యంగా విద్యార్థుల చదువుకు సహాయం చేయడం ద్వారా కలిగే ఆత్మ సంతృప్తి అపారమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి స్కూల్‌కు, మేదర్ బస్తీ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కౌన్సిలర్ బండి నరసింహ రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వీరబాబు, శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావు, విమలతో పాటు జమాతే ఇస్లామి కొత్తగూడెం అధ్యక్షుడు ఫారూఖ్ యజ్దాని, రియాజ్ బేగ్ పాల్గొన్నారు.

‘విద్యార్థులకు ఏ చిన్న సాయమైన సమాజ అభివృద్ధికి పెద్ద అడుగు’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

