చెన్నై: ఇద్దరు దొంగలు జ్యువెలరీ షాపులో చోరీకి ప్రయత్నించారు. ఒక వ్యక్తి షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లాడు. నగలు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే యజమాని, మహిళా సిబ్బంది చాకచక్యంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. (Robbers Throw Acid At Jeweller Staff) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అతూర్లోని కడయీథి ప్రాంతంలో ఏవీఎస్ జ్యువెలర్స్ షాపును వైతీశ్వరన్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు కస్టమర్లుగా నటిస్తూ ఆ షాపులోకి ప్రవేశించారు.
కాగా, వైతీశ్వరన్, ఆయన భార్య సెల్వ లక్ష్మి, మహిళా ఉద్యోగి వసంతి వారికి నగలు చూపించారు. ఇంతలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా వారిపై యాసిడ్ పోశాడు. బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో వైతీశ్వరన్, ఆయన భార్య, మహిళా ఉద్యోగి ప్రతిఘటించారు. ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
మరోవైపు మరో వ్యక్తి గన్ ఎక్కుపెట్టి బెదిరిస్తూ ఆ షాపు నుంచి బయటకు పారిపోయాడు. అయితే స్థానికులు అతడ్ని వెంబడించారు. సుమారు కిలోమీటరు దూరం వరకు అతడి వెనుక పరుగెత్తారు. చివరకు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి చేతిలో ఉన్న రివాల్వర్‌ను లాక్కున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
சேலம்: ஆத்தூரில் நகைக்கடை உரிமையாளர்கள் மீது ஆசிட் வீசி நகைக் கொள்ளை முயற்சி; துப்பாக்கியுடன் வந்த இருவரை பொதுமக்கள் விரட்டி பிடித்து போலீசாரிடம் ஒப்படைத்தனர்#Salem | #Theft | #JewelleryShop | #CCTV pic.twitter.com/3XX7zkN4BK
— PttvOnlinenews (@PttvNewsX) August 8, 2025
Also Read:
Couple Fight Turns Violent | హింసాత్మకంగా మారిన దంపతుల ఫైట్.. భర్త మృతి, భార్యకు కత్తి గాయాలు
DK Shivakumar | ఫ్లైఓవర్‌పై స్కూటి నడిపిన డీకే శివకుమార్.. ఆ బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ చలాన్లు
Watch: రెండు ట్రాలీల మధ్య నలిగిన బొలెరో వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?