జైపూర్: భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Couple Fight Turns Violent) రాజస్థాన్‌లో బికనీర్‌లో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల సన్నీ, 40 ఏళ్ల మమత భార్యాభర్తలు. కమ్లా కాలనీలో నివసిస్తున్న ఈ జంట బుధవారం రాత్రి ఇంట్లో గొడవపడ్డారు. ఆగ్రహించిన సన్నీ వంటగదిలో ఉన్న కత్తి తెచ్చాడు. ఇంతలో అతడి తమ్ముడు జీతు జోక్యం చేసుకున్నాడు. మమతపై కత్తితో దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఈ ఘర్షణలో సన్నీ మెడకు కత్తి గాయాలయ్యాయి. భార్య మమత, సన్నీ సోదరుడు జీతు కూడా గాయపడ్డారు. ఈ ముగ్గురిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సన్నీ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మమత, జీతుకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సమాచారం తెలుసుకున్నారు. దీంతో సన్నీ మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Disguised As Sadhu, Man Kills Wife | పదేళ్ల తర్వాత సాధువు వేషంలో వెళ్లి.. భార్యను చంపిన వ్యక్తి
Watch: కారు నడిపిన బాలుడు.. టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి
DK Shivakumar | ఫ్లైఓవర్‌పై బైక్ నడిపిన డీకే శివకుమార్.. ఆ బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ చలాన్లు