లక్నో: రోడ్డుపై వెళ్తున్న బొలెరో వాహనం రెండు ట్రాలీల మధ్య నలిగిపోయింది. (Bolero Crushed Between Two Trucks) అయితే అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వ్యక్తి, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 4న సాయంత్రం వేళ కర్మౌరా ప్రాంతానికి చెందిన రితేష్ సింగ్ తన డ్రైవర్ దీన్బంధుతో కలిసి మహీంద్రా బొలెరోలో గోరఖ్‌పూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు.
కాగా, రోడ్డుపై రెండు ట్రాలీ వాహనాలు వెళ్తున్నాయి. వాటి మధ్యలో బొలెరో ఉన్నది. ఒకచోట ముందు వెళ్తున్న ట్రాలీ వాహనం ఆగింది. దీంతో వెనుక ఉన్న బొలెరో వాహనం డ్రైవర్ కూడా బ్రేక్ వేశాడు. అయితే దాని వెనుక ఉన్న మరో ట్రాలీ డ్రైవర్ బ్రేక్ వేయలేదు. దీంతో ఆ భారీ వాహనం బొలెరోపైకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రెండు ట్రాలీల మధ్య బొలెరో వాహనం నలిగి ధ్వంసమైంది. ఆ తర్వాత ముందున్న ట్రాలీ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే బొలెరోలో ఉన్న రితేష్ సింగ్, అతడి డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. వాహనంలో చిక్కుకున్న వారిద్దరిని స్థానికులు బయటకు తీశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడి నుంచి పారిపోయిన ఒక ట్రాలీని గుర్తించి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. మరో ట్రాలీ వాహనం కోసం వెతుకుతున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mahendra Bolero got crushed between 2 trucks in Gorakhpur UP
Same incident like this with auto rickshaw i posted on 03/08/2025… pic.twitter.com/QK20uh2G6w
— Deadly Kalesh (@Deadlykalesh) August 7, 2025
Also Read:
DK Shivakumar | ఫ్లైఓవర్‌పై స్కూటి నడిపిన డీకే శివకుమార్.. ఆ బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ చలాన్లు
Couple Fight Turns Violent | హింసాత్మకంగా మారిన దంపతుల ఫైట్.. భర్త మృతి, భార్యకు కత్తి గాయాలు
Watch: కారు నడిపిన బాలుడు.. టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి