ఆరోగ్యకర ఉత్పత్తులు పండించాలి: అల్దాస్ జానయ్య
మహిళా రైతులు ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు పండించాలని వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మహిళా రైతులు ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు పండించాలని వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయశాఖ, కోరమాండల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రెండ్రోజుల మెగా మహిళా రైతు మేళా సోమవారం ముగిసింది. ఈ మేళాకు సుమారు 11వేల మంది మహిళా రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. అధిక రసాయనాలతో సాగు చేయడం వల్ల నేల, గాలి, నీటి నాణ్యతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మేళాను ఘనంగా నిర్వహించిన పీజేటీఏయూ సురేంద్రమోహన్ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్, విత్తనోభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

