న్యూఢిల్లీ: భారీ వర్షానికి గోడ కూలింది. (Wall Collapses) ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు మరణించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రంతా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా, వర్షం వల్ల శనివారం ఉదయం హరి నగర్లోని ఒక ఇంటి గోడ కూలింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించారు. మృతులను 30 ఏళ్ల షబీబుల్, 30 ఏళ్ల రబీబుల్, 45 ఏళ్ల ముట్టు అలీ, 25 ఏళ్ల రుబినా, 25 ఏళ్ల డాలీ, ఆరేళ్ల రుఖ్సానా, ఏడేళ్ల హసీనాగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Election Commission | 334 రాజకీయ పార్టీలను.. జాబితా నుంచి తొలగించిన ఈసీ
Woman Kills Her Newborn | ప్రసవం తర్వాత బిడ్డను చంపిన తల్లి.. శిశువు మృతదేహాన్ని చెత్తలో పారవేత