INDW vs AUSW : వన్డే ఛాంపియన్ భారత జట్టు(Team India)కు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా గడ్డపై పొట్టి సిరీస్ గెలుపొందిన టీమిండియా.. వన్డే ఫార్మాట్లో మాత్రం చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. మూడో వన్డేలోనూ చేతులెత్తేసింది. అలీసా హీలీ(158) వీడ్కోలు సెంచరీతో.. సథర్లాండ్(106) మెరుపులతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత స్టార్లు కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా.. 185 పరుగుల దారుణ ఓటమి మూగట్టుకుంది.
ఆస్ట్రేలియా గడ్డపై పొట్టి సిరీస్ పట్టేసిన భారత మహిళల జట్టు వన్డేల్లో మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా.. నామమాత్రమైన మూడో మ్యాచ్‌లోనూ దాసోహమైంది. తొలుత అలీసా హీలీ(158), అనాబెల్ సథర్లాండ్(106)ల ఊచకోతతో ప్రత్యర్థికి 409 పరుగులభారీ స్కోర్ సమర్పించుకున్న భారత్.. బ్యాటింగ్ విభాగంలోనూ సమిష్టిగా విఫలమైంది.
Final ODI. First time as a bowler in international cricket for Alyssa Healy pic.twitter.com/SrOUPtS9YM
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
రికార్డు ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే నికోలా కారీ షాకిచ్చింది. ఓపెనర్ స్మృతి మంధాన(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపిన తను.. తొలి వికెట్ అందించగా.. ప్రతీకా రావల్(27)ను సథర్లాండ్ ఔట్ చేసింది. 62 వద్ద రెండో వికెట్ పడిన వేళ.. జెమీమా రోడ్రిగ్స్()42, హర్మన్‌ప్రీత్ కౌర్(25)లు భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. జెమీమాను అష్లీ గార్డ్నర్ ఔట్ చేసిన కాసేపటికే అలనా కింగ్(4-33)కు వికెట్ల ముందు హర్మన్‌ప్రీత్ దొరికిపోయింది. అంతే.. అక్కడి నుంచి భారత్ కోలుకోలేకపోయింది.
Century in her final ODI ✅
Captained in her final ODI ✅
Australia win 3-0 ✅What a farewell for one of the greatest, Alyssa Healy ✨
Scorecard: https://t.co/871Z69bxgJ pic.twitter.com/5PPuggl1Tt
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
రీచా గోష్(18), హర్లీన్ డియోల్(14) ఆసీస్ బౌలర్లను కాచుకొని స్కోర్ బోర్డును నడిపించినా.. లోయర్ ఆర్డర్‌ను అలనా కింగ్ దెబ్బకొట్టింది. ఆఖర్లో స్నేహ్ రానా(44) పోరాడినా.. అప్పటికే ఓటమి ఖాయమైంది శ్రీచరణ(11)ని ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ 224 వద్దే ముగిసింది. 185 పరుగలు తేడాతో గెలుపొందిన కంగారూ టీమ్ 3-0తో సిరీస్‌ను ఒడిసిపట్టింది.