న్యూఢిల్లీ: భారతీయ దుస్తులు ధరించిన భార్యాభర్తలను ఒక రెస్టారెంట్ లోనికి అనుమతించలేదు. (Restaurant Denies Entry To Couple) ఆ జంట దీని గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పితంపుర ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లో తమకు చేదు అనుభవం ఎదురైనట్లు ఒక జంట వాపోయింది. భారతీయ దుస్తులు ధరించినందుకు తమ ప్రవేశాన్ని నిరాకరించారని వారు ఆరోపించారు. రెస్టారెంట్ మేనేజర్ తమతో అనుచితంగా ప్రవర్తించినట్లు విమర్శించారు. భారతీయ దుస్తులు ధరించిన వ్యక్తులను అనుమతించని రెస్టారెంట్‌కు పనిచేసే హక్కు లేదని, దానిని వెంటనే మూసివేయాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా దీనిపై స్పందించారు. ఢిల్లీలో ఇలాంటివి ఆమోదం కాదని అన్నారు. ఈ సంఘటనను సీఎం రేఖా గుప్తా తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఆ రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారి ప్రవేశాన్ని నిరాకరించినట్లు తెలిపారు. తమ రెస్టారెంట్లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదని చెప్పారు. అందరు కస్టమర్లకు స్వాగతం చెబుతామని ఆయన అన్నారు.
This is unacceptable in Delhi
पीतमपुरा के एक रेस्टोरेंट में भारतीय परिधानों पर रोक का वीडियो सामने आया है
ये अस्वीकार्य है
CM @gupta_rekha जी ने घटना का गंभीरता से संज्ञान लिया है
अधिकारियों को इस घटना की जांच व तुरंत कार्यवाही के निर्देश दिए गए हैं https://t.co/ZUkTkAZmAT
— Kapil Mishra (@KapilMishra_IND) August 8, 2025
Also Read:
Income Tax Bill 2025 | ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. ఆగస్ట్ 11న కొత్త వెర్షన్ బిల్లు ప్రవేశం
Goods Train Derails | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
Man Kills Wife With 2 Lovers | ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి.. భార్యను హత్య చేసిన భర్త