ముంబై: గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. (Goods Train Derails) దీంతో ఆ రైలు మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లలోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం నందగావ్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ రైలు ప్రధాన మార్గం నుంచి లూప్ లైన్‌కు మారుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలును సరిచేశారు. ఆ రైలు ఎందుకు పట్టాలు తప్పింది, కారణం ఏమిటి అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రధాన మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Also Read:
Income Tax Bill 2025 | ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. ఆగస్ట్ 11న కొత్త వెర్షన్ బిల్లు ప్రవేశం
Man Kills Wife With 2 Lovers | ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి.. భార్యను హత్య చేసిన భర్త
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం