Lucknow |ఇరాన్లో ఖమేనీ మృతి.. లక్నోలో నిరసనలకు పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు
Lucknow : ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను, ఖమేనీ మృతిని నిరసిస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి ఇండియాలోని పలు ముస్లిం సంఘాలు.
Lucknow : ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను, ఖమేనీ మృతిని నిరసిస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి ఇండియాలోని పలు ముస్లిం సంఘాలు. ఈ మేరకు అన్ని ముస్లిం సంఘాలు ఖమేనీ మృతికి సంతాపం తెలపాలని, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాలని లక్నోలోని మౌలానా జవ్వాద్ పిలుపునిచ్చాడు.
మరోవైపు ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) జనరల్ సెక్రెటరీ మౌలానా యాసూబ్ అబ్బాస్ కూడా దీనిపై స్పందించాడు. ఆదివారం సాయంత్రం లక్నోలోని చోటా ఇమాంబారా దగ్గర భారీ నిరసనలు, సంతాప సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని కూడా ప్రకటించాడు. ఖమేనీ మృతికి నిరసనగా దేశంలోని షియా వర్గం ముస్లింలు మూడు రోజులు సంతాపం ప్రకటించాడు. ఈ సందర్భంగా అందరూ నల్ల రంగు బ్యాడ్జీలు, దుస్తులు ధరించాలని, ఇంటిపై నల్ల రంగు జెండాలు ఎగరేయాలని, ప్రత్యేక ప్రార్థనలు జరపాలని కూడా అబ్బాస్ పిలుపునిచ్చాడు. ఏఐఎంపీఎల్బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, లక్నో షహర్ ఖాజీ మౌలానా ఖలిద్ రషీద్ మాట్లాడుతూ ఖమేనీని అంతమొందించడాన్ని ఖండించాడు.
అంతర్జాతీయ సమాజం ఈ దాడిని ఖండించాలని కోరాడు. సున్నీ ముస్లింలు కూడా మసీదుల్లో ఖమేనీకి ప్రత్యేక ప్రార్థనలు జరపాలని సూచించాడు. మరోవైపు షియాకు చెందిన మౌలానా కల్బే జవ్వాద్ ఖమేనీ హత్యను ఖండించాడు. ఆయనను చంపడం శతాబ్దంలోనే అతిపెద్ద విషాద ఘటనగా అభివర్ణించారు. మరికొందరు ముస్లిం లీడర్లు కూడా ఖమేనీ హత్యను ఖండించారు. ఈ మేరకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

