‘సుందరయ్యనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి’
సారపాక పంచాయతీలోని సుందరయ్యనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కాలనీలో గుత్తేదారు మూడు రోడ్లకు సంబంధించి..
బూర్గంపహాడ్, ఆగస్టు 11 : సారపాక పంచాయతీలోని సుందరయ్యనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కాలనీలో గుత్తేదారు మూడు రోడ్లకు సంబంధించి మట్టిని తొలగించి ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో రెండుసార్లు లెవలింగ్ చేశారని, అయినా ఇప్పటివరకు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికే సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లామని, హామీలు ఇస్తున్నారే తప్ప పని జరగడం లేదని బత్తుల ఆరోపించారు. ఈ నెల 15లోగా రోడ్ల పనులు ప్రారంభించకపోతే టెంట్ వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మరోవైపు డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించి డ్రైనేజీ సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజిని, ఎస్కే.అబీదా, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ షాహదా, ప్రియాంక, జరీనా, షకీరా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

