న్యూఢిల్లీ: ఒక మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గొంతునొక్కి శిశువును చంపింది. (Woman Kills Her Newborn) బిల్డింగ్ ఆవరణలోని డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పడేసింది. పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన 26 ఏళ్ల రోష్నికి 2019లో ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. 2021లో భర్త నుంచి ఆమె విడిపోయింది. 2023 నుంచి ఢిల్లీలోని పటేల్ నగర్లో ఒక ఇంట్లో పనిమనిషిగా ఉన్నది.
కాగా, 2024లో బంధువుల పెళ్లి కోసం రోష్ని తన గ్రామానికి వెళ్లింది. అక్కడ ప్రియుడితో శారీరకంగా కలిసింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఆమెకు సహకరించేందుకు అతడు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో గర్భవతి అన్నది దాచేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. తన కడుపులో సమస్య ఉన్నట్లు ఇంటి ఓనర్‌కు చెప్పింది. దీంతో ఆసుపత్రిలో చూపించుకోమని వారు సలహా ఇచ్చారు.
మరోవైపు జూలై 26న ఇంటి యజమాని కుటుంబం బయటకు వెళ్లారు. దీంతో ఆ ఇంట్లోని బాత్రూమ్లో మగబిడ్డకు రోష్ని జన్మనిచ్చింది. అయితే ఈ విషయం అందరికి తెలుస్తుందని ఆమె భయపడింది. దీంతో గొంతునొక్కి బిడ్డను హత్య చేసింది. శిశువు మృతదేహాన్ని కవర్లో ఉంచి డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, జూలై 28న కవర్లోని శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించారు. ఆ ఇంటి యజమానికి ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా గుడ్డముక్కతో గొంతునొక్కి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
మరోవైపు రోష్ని కోసం వెతికిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె ప్రియుడ్ని కూడా ప్రశ్నిస్తామని, దర్యాప్తు మేరకు అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Kills Wife With 2 Lovers | ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి.. భార్యను హత్య చేసిన భర్త
Income Tax Bill 2025 | ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. ఆగస్ట్ 11న కొత్త వెర్షన్ బిల్లు ప్రవేశం
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం