భువనేశ్వర్: రక్షా బంధన్ జరుపుకునేందుకు డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేందుకు నర్సు సిద్ధమైంది. అయితే హాస్పిటల్లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించింది. (Nurse Found Dead In Hospital) ఈ నేపథ్యంలో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా ఒక మహిళ పని చేస్తున్నది. శనివారం రాఖీ జరుపుకునేందుకు డ్యూటీ తర్వాత గంజాం జిల్లాలో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే హాస్పిటల్లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించింది.
కాగా, రెండు గంటలు ఆలస్యంగా హాస్పిటల్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చినట్లు నర్సు సోదరుడు ఆరోపించాడు. తొలుత బాత్రూమ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తమకు తెలిపారని, ఆ తర్వాత ఆమె చేతిలో సిరంజి ఉన్నదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారన్నాడు. ఈ నేపథ్యంలో సోదరి మరణంలో ఆసుపత్రి పాత్ర ఉన్నట్లు సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు.
మరోవైపు ఆ హాస్పిటల్కు చేరుకున్న పోలీసులు నర్సు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె చేతిలో సిరంజి, చేతి వెనుక భాగంలో సూది ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సూది ద్వారా ఇంజెక్ట్ చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆత్మహత్య, ప్రమాదవశాత్తు మరణం, ఆరోగ్య సమస్యలు, రిలేషన్పిష్, పని ప్రదేశంలో వేధింపులు, కుటుంబ సమస్యలు వంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు.
Also Read:
Karnataka horror | తెగిన తల, పలు చోట్ల శరీర భాగాలు.. మహిళ హత్యపై పోలీసులు దర్యాప్తు
Watch: కదులుతున్న బస్సులో మంటలు.. తర్వాత ఏం జరిగిందంటే?