చండీగఢ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు కదులుతుండగా కొందరు మహిళలు కిందకు దూకారు. (Passengers Jump Out Of Moving Bus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 6న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక ప్రైవేట్ బస్సు కొందరు ప్రయాణికులతో ముకేరియన్ నుంచి తల్వారాకు వెళ్తున్నది.
కాగా, బస్సు ఇంజిన్ వైరింగ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఇది చూసి భయాందోళన చెందారు. కొందరు మహిళలు తమ ప్రాణాలు దక్కించుకునేందుకు కదులుతున్న బస్సు నుంచి కిందకు దూకారు. అదుపుతప్పి రోడ్డు పక్కన పడ్డారు. బస్సు ఆగడంతో మిగతా ప్రయాణికులు కూడా వెంటనే బయటపడ్డారు.
మరోవైపు బస్సు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలు మరింతగా వ్యాపించలేదు. వెంటనే మంటలను అదుపుచేయడంతో ప్రమాదాన్ని నివారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
भरधाव बसच्या इंजिनला अचानक लागली आग; प्रवाशांचा जीवघेणा बचाव#बसआग #प्रवासीसुरक्षा #होशियारपूर #मुकेरियां #तलवाडारोड #अपघातबातमी #सीसीटीव्हीफुटेज #बसअपघात #आगप्रसंग #रहदारीअपघात#BusFire #PassengerSafety #Hoshiarpur #Mukerian #TalwaraRoad #AccidentNews #CCTVFootage pic.twitter.com/CKiyiVaz2b
— Policenama (@Policenama1) August 9, 2025
Also Read:
Watch: కారు నడిపిన బాలుడు.. టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి
Watch: రెండు ట్రాలీల మధ్య నలిగిన బొలెరో వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం