Vijay-Rashmika | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే వారి పెళ్లి ఫోటోలు అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా ఈ జంట తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది. షేర్ చేసిన ఫోటోలలో విజయ్–రష్మిక కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆనందభరితమైన నవ్వులు, స్టైలిష్ లుక్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. సంగీత్ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగినట్టు తెలుస్తోంది.
రష్మిక ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్ తో అందంగా మెరిసిపోగా, విజయ్ క్లాసీ లుక్‌లో కనిపించారు. ఇద్దరూ కలిసి వేసిన క్యూట్ స్టెప్పులు, సరదా క్షణాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సంగీత్ ఫోటోలు బయటకు రాగానే అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్స్‌తో హర్షం వ్యక్తం చేస్తున్నారు. “పర్ఫెక్ట్ కపుల్”, “గోల్ సెట్టింగ్ జంట” అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.పెళ్లి వేడుకల ప్రతి ఘట్టాన్ని అభిమానులతో పంచుకుంటున్న విజయ్–రష్మిక జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వారి ఆనంద క్షణాలు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26న వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తెలుగు, కొడవ సాంప్రదాయాల్లో ఒకేరోజున రెండుసార్లు జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుక దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.