Nagarkurnool | స్కానింగ్ సెంటర్ టాయిలెట్లో 16 ఏళ్ల బాలికకు ప్రసవం.. నాగర్కర్నూల్లో సంచలనం
Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక తన తల్లితో కలిసి సోమవారం నాడు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ బాలికను పరిశీలించిన వైద్యులు స్కానింగ్ అవసరమని చెప్పడంతో.. ప్రైవేటు స్కానింగ్ సెంటర్కు వెళ్లింది. అక్కడ టాయిలెట్కు వెళ్లిన సమయంలో బాలికకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో బాలిక తల్లి సాయంతో సాధారణ ప్రసవం జరిగింది. పండంటి మగ శిశువుకు బాలిక జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును చెత్తబుట్టలో వేసేందుకు బాలిక తల్లి ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్ సెంటర్కు చేరుకుని.. బాలిక, శిశువును నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

