అనంతగిరి, ఆగస్టు 14 : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షుడు అఫ్జల్, నాయకులు పి.వీరయ్య, వెంకటప్పయ్య, నాగేశ్వరరావు, చార్లెస్ పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు