విశాల్ కథానాయకుడిగా సుందర్.సి దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘మద గజ రాజా’ చిత్రం లేట్‌గా విడుదలైనా లేటెస్ట్ విజయాన్ని అందుకున్నది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా ‘మొగుడు’. తమన్నా కథానాయిక. అరుణ్‌కుమార్, ఖుష్బూ సుందర్ నిర్మాతలు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ని కోల్కత్తా, గోవా, చెన్నైల్లో ప్లాన్ చేశారు. ఓ సాధారణ మొగుడిలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే, రౌడీల భరతంపట్టే అండర్ కవర్ పోలీస్‌లా ఇందులో విశాల్ కనిపిస్తారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని, అన్ని రకాల అంశాల్నీ మేళవించిన ఫుల్ మాస్ కమర్షియల్ మూవీ ఇదని మేకర్స్ చెబుతున్నారు. నవదీప్, సంపత్, అజయ్‌ఘోష్, గరుడరామ్, వీటీవీ గణేష్, యోగిబాబు తదితరులు ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గోపీ అమర్నాథ్, సంగీతం: హిప్ హాప్ తమిళ, నిర్మాణం: అవని సినిమాస్ ప్రై.లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రై.లిమిటెడ్.