Pelli Choopulu | ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్
Pelli Choopulu | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న 'పెళ్లిచూపులు' విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Pelli Choopulu | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పరిచయమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సహజమైన కథనం, వినోదభరితమైన సంభాషణలు, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని పలువురు ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది.
‘పెళ్లిచూపులు’ విజయ్ దేవరకొండ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. సోలో హీరోగా ఆయనకు ఇది తొలి పెద్ద విజయం. సినిమాలో విజయ్ నటన, సహజమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు అందుకున్న విజయ్, ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన రీతూ వర్మ తన సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుని ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందింది.
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి సినిమాతోనే తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్నారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత టాలీవుడ్లో క్రేజీ దర్శకుడిగా ఎదిగిన ఆయన, అనంతరం నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించారు.బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పెళ్లిచూపులు’ అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ జాతీయ పురస్కారం అందుకోగా, ఉత్తమ మాటల రచయితగా దర్శకుడు తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.
అలాగే 2016 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి విభాగాల్లో రెండు నంది అవార్డులు కూడా ప్రకటించబడ్డాయి. ఇందులో రీతూ వర్మ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. అయితే ఆ సమయంలో నంది అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర సినీ పురస్కారాల్లో కూడా ‘పెళ్లిచూపులు’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ చిత్రాన్ని సెకండ్ బెస్ట్ మూవీగా ఎంపిక చేసి చిత్రబృందాన్ని సత్కరించింది. దీంతో విడుదలై పదేళ్లు పూర్తయినా ‘పెళ్లిచూపులు’ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

