బెంగళూరు: దివ్యాంగురాలైన యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (differently abled woman gang-raped) దీనిని రికార్డ్ చేసి ఆమె సోదరుడి మొబైల్ ఫోన్‌కు పంపారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెన్షన్ మొహల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వికలాంగ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేయడంతోపాటు బాధితురాలి సోదరుడికి దానిని పంపారు. కొంతసేపటి తర్వాత ఆ వీడియో క్లిప్‌ను డిలీట్ చేశారు.
కాగా, వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియో క్లిప్ చూసి బాధిత యువతి సోదరుడు షాక్ అయ్యాడు. ఆధారం కోసం తన స్నేహితుడికి దానిని షేర్ చేశాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అబ్దుల్ అఫ్తాబ్, రజిక్ పాషా, ఉమ్రాన్గా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
మరోవైపు దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని బెదిరించడానికి లేదా అవమానించడానికి వీడియో రికార్డ్ చేసి ఆమె సోదరుడికి పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ సంఘటన హసన్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానికులు నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read:
Karnataka horror | తెగిన తల, పలు చోట్ల శరీర భాగాలు.. మహిళ హత్యపై పోలీసులు దర్యాప్తు
Watch: కదులుతున్న బస్సులో మంటలు.. తర్వాత ఏం జరిగిందంటే?