భోపాల్: ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ టీచర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. (Teacher Get Foot Massage From Student) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 7న గాంధీనగర్‌లోని ప్రభుత్వ మహాత్మా గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్లో లంచ్ తర్వాత విద్యార్థులు క్లాసుల్లో ఉన్నారు. నాల్గవ తరగతి గదిలో విద్యార్థులు నేలపై కూర్చొన్నారు. ఒక ఉపాధ్యాయురాలు కుర్చీపై కూర్చొన్నది. మరో కుర్చీపై కాలు పెట్టింది. మోకాళ్లపై కూర్చొన్న ఒక విద్యార్థి ఆమె పాదానికి మసాజ్ చేశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థితో పాదాలకు మసాజ్ చేయించుకున్న ఆ టీచర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించింది. స్కూల్ గేట్ వద్ద ఉన్న గుంతలో తన పాదం మెలిపడినట్లు ఉపాధ్యాయురాలు తెలిపింది. దీంతో విద్యార్థులు తనకు సహాయం చేశారని చెప్పింది. తనను కుర్చీలో కూర్చోబెట్టారని, మెలిపడిన పాదానికి నొప్పి తగ్గించడానికి ఒక విద్యార్థి ఆప్యాయతతో మసాజ్ చేశాడని వెల్లడించింది.
#WATCH | #Bhopal: Govt School Teacher Gets Foot Massage From Student; Video Goes Viral#MPNews #MadhyaPradesh pic.twitter.com/LJ4JaddI4P
— Free Press Madhya Pradesh (@FreePressMP) August 10, 2025
Also Read:
Woman Calls Lover Home Kills | ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
Tejashwi Yadav | బీహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓటరు కార్డులు: తేజస్వి యాదవ్ ఆరోపణ