లక్నో: ఒక మహిళకు పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నది. అయితే ఆ ప్రియుడ్ని తన ఇంటికి ఆమె పిలిచింది. భర్తతో కలిసి దారుణంగా హింసించి హత్య చేసింది. (Woman Calls Lover Home Kills) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఈ సంఘటన జరిగింది. రయీస్ అహ్మద్, సితార భార్యాభర్తలు. పొరుగింటికి చెందిన 45 ఏళ్ల అనీష్‌కు సితారతో వివాహేతర సంబంధం ఉన్నది.
కాగా, శనివారం రాత్రి అనీష్‌ను తన ఇంటికి రమ్మని సితార పిలిచింది. అక్కడకు వచ్చిన అతడిపై భర్త రయీస్ అహ్మద్‌తో కలిసి దాడి చేసింది. స్క్రూడ్రైవర్‌తో పొడిచి, కటింగ్ ప్లయర్ వంటి పరికరాలతో అతడ్ని హింసించారు. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వచ్చిన అనీష్ ఆ తర్వాత చనిపోయాడు.
మరోవైపు అనీష్ మృతిపై అతడి తండ్రి ముస్తాకిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింటి కుటుంబానికి తన కుమారుడు గతంలో ఏడు లక్షలు అప్పు ఇచ్చినట్లు తెలిపాడు. అనీష్‌కు పెళ్లి కుదరడంతో డబ్బు తిరిగి ఇవ్వమని అడిగేందుకు పొరుగింటికి వెళ్లాడని చెప్పాడు. అయితే ఆ దంపతులు దారుణంగా హింసించి తన కుమారుడ్ని హత్య చేశారని ఆరోపించాడు.
కాగా, అనీష్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనీష్‌కు సితారతో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అనీష్‌ను తన ఇంటికి రప్పించి భర్తతో కలిసి హింసించి హత్య చేసిందని చెప్పారు. భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Karnataka horror | తెగిన తల, పలు చోట్ల శరీర భాగాలు.. మహిళ హత్యపై పోలీసులు దర్యాప్తు
Tejashwi Yadav | బీహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓటరు కార్డులు: తేజస్వి యాదవ్ ఆరోపణ