పాట్నా: బీహార్‌లో తాజాగా నివాస ధృవీకరణ పత్రం కోసం ఒక పిల్లి దరఖాస్తు చేసింది. ‘క్యాట్ కుమార్’ (Cat Kumar) పేరుతో దాఖలైన ఆన్లైన్ అప్లికేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘డాగ్ బాబు’, ‘డాగేష్ బాబు’ పేరుతో రెండు కుక్కలు, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు సోనాలికా ట్రాక్టర్ పేరుతో రెసిడెన్స్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు అందాయి.
కాగా, తాజాగా రోహ్తాస్ జిల్లాలో ‘క్యాట్ కుమార్’ పేరుతో నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్లో దరఖాస్తు అందింది. తండ్రి పేరు ‘క్యాటీ బాస్’, తల్లి పేరు ‘కాటియా దేవి’గా పేర్కొన్నారు. అతిమిగంజ్ గ్రామం, వార్డ్ 07, పోస్ట్ మహాదేవ, పోలీస్ స్టేషన్ నస్రిగంజ్, పిన్ 821310 అనే చిరునామా ఉన్నది. ఈ దరఖాస్తులో అభ్యర్థి ఫొటో బదులు పిల్లి ఫొటోను అప్లోడ్ చేశారు.
మరోవైపు నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌశల్ పటేల్ దృష్టికి ఈ దరఖాస్తు వెళ్లింది. దీంతో జూలై 29న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ఆన్లైన్ సేవల దుర్వినియోగం, తప్పుడు వివరాలతో అధికారులను అపహాస్యం చేయడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో ఎవరు దరఖాస్తు చేశారు?, ఎవరు ఆమోదం తెలిపారు? దీనికి ఎవరు బాధ్యులు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Tejashwi Yadav | బీహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓటరు కార్డులు: తేజస్వి యాదవ్ ఆరోపణ
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక మృతి.. ఒడిశాలో నాలుగో సంఘటన
Woman Calls Lover Home Kills | ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ