భువనేశ్వర్: నిప్పంటించుకుని మరో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఇది నాలుగో సంఘటన. బార్గఢ్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం తన మామ ఇంటికి ఆమె బయలుదేరింది. మార్గమధ్యలో ఫిరింగిమల్ గ్రామంలోని ఫుట్‌బాల్ మైదానంలో తీవ్రంగా కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. చాలా ఆలస్యంగా రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తీవ్ర కాలిన గాయాలైన ఆ బాలికను బుర్లాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే ఆ బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీస్ అధికారి తెలిపారు. దీనికి కారణం ఇంకా తెలియలేదని, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ఎవరైనా నిప్పంటించారా అన్నది కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
మరోవైపు ఒడిశాలో నెల రోజుల్లో నలుగురు విద్యార్థినులు నిప్పంటించుకుని చనిపోయారు. జూలై 12న లెక్చరర్ లైంగిక వేధింపులు భరించలేక బాలసోర్‌లోని కాలేజీ క్యాంపస్‌లో 20 ఏళ్ల విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 19న బలంగాలో ముగ్గురు దుండగులు ఒక మైనర్ బాలికకు నిప్పంటించారు. చికిత్స పొందుతూ ఆగస్ట్ 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించింది.
ఆగస్ట్ 6న కేంద్రపారా జిల్లాకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కాలిన మృతదేహాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ప్రియుడి వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా ఆ యువతి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
Also Read:
Fake police station | నకిలీ పోలీస్ స్టేషన్ గుట్టురట్టు.. డబ్బులు దోచుకుంటున్న ముఠా అరెస్ట్
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్
Watch: ఎదురుపడిన మనిషి, సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?