లక్నో: కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. (Fake police station) నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. నోయిడాలోని ఫేజ్ 3 ప్రాంతంలో నకిలీ అంతర్జాతీయ పోలీస్ కార్యాలయం, అంతర్జాతీయ నేర దర్యాప్తు సంస్థను కొందరు వ్యక్తులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ సభ్యులుగా వారు నటిస్తున్నారు. నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ చిహ్నాలను ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. www.intlpscrib.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. దీని కోసం నకిలీ జాతీయ, అంతర్జాతీయ ధృవీకరణ పత్రాలను అందులో పోస్ట్‌చేశారు.
కాగా, ఇటీవలే ఏర్పాటు చేసిన ఈ నకిలీ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ గురించి నోయిడా పోలీసులకు తెలిసింది. దీంతో వారు అక్కడకు వెళ్లి తనిఖీ చేయడంతోపాటు దానిని సీజ్ చేశారు. నకిలీ ఐడీలు, నకిలీ పత్రాలు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల బహిర్గతమైన నకిలీ విదేశీ రాయబార కార్యాలయం మాదిరిగా ఈ నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ వెలుగులోకి రావడం కలకం రేపింది.
Also Read:
Watch: ఎదురుపడిన మనిషి, సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
BJP Expels Spokesperson | బీజేపీపై బహిరంగ విమర్శలు.. అధికార ప్రతినిధి బహిష్కరణ
Woman Calls Lover Home Kills | ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్