KTR | శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రివర్యులు, భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను ఆనాడు రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో సమర్థవంతంగా నిర్వహించి.. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మహిళా కమిషన్ చైర్మన్గా మహిళల అభివృద్ధి కోసం పనిచేసి ఈ రోజు నర్సాపూర్ శాసనసభ్యులుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి, గౌరవ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ఈ రోజు మనమందరం ఇలా కూర్చున్నాం.. కలుసుకున్నాం అంటే దానికి కారణం మా చెల్లెలు మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి అని అన్నారు.
వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ (మార్చి 8వ)శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులు.. వీరిలో ఆర్టిస్టులు, సోషల్ వర్కర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, శానిటేషన్ వర్కర్లు, పబ్లిక్ రిప్రంజెటేటివ్స్ ఉన్నారు. వారిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి పురస్కారాలు అందజేసిన నవతా రెడ్డికి బీఆర్ఎస్ శేరిలింగంపల్లి నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు కేటీఆర్.
ప్రపంచవ్యాప్తంగా అడుగడుగునా పురుషాధిక్యత..
రాజకీయాలు మాట్లాడేందుకు ఇది వేదిక కాదు కానీ.. ఒకటి మాత్రం వాస్తవం ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత అడుగడుగునా ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేం కాదు. చాలా సందర్భాల్లో ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో ఇతర పురుషులే కొట్టాడలేని పరిస్థితి.. అందులో మహిళలు తట్టుకొని, నిలదొక్కుకొని వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరముంటది.. ఇది వాస్తవమన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధించడానికి 100 శాతం కృషి చేస్తే.. ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200 శాతం వారు శ్రమించక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నం. మహిళలకు ప్రత్యేకంగా మూడు పారిశ్రామిక పార్కలు ఏర్పాటు చేసుకున్నం. కొంతమందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నాలు చేశాం. దాంతోపాటు వీహబ్ అనే ప్రయత్నం చేశాం. తద్వారా కాలేజీల్లో ఉండే యవత కూడా పారిశ్రామిక వేత్తలుగా, ఇంకా పెద్దవారిగా ఎదగాలని ప్రయత్నాలు చేసినమన్నారు.
దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి చాలా విషయాలు చెప్పారు. కానీ నేను మాత్రం వాటి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు.. నాక్కూడా పదిహేడేళ్ల కూతురుంది. కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు.. కావాల్సిన అమ్మాయిలకు, యువతీ యువకులకు మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోండి. మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం ఆటోమేటిక్గా వస్తాయన్నారు. ఎంతసేపు మనం ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటే… దాని వల్ల వచ్చే ఇబ్బందులు మీ ఇంట్లో అమ్మను లేదా పెద్దవాళ్లను అడగొచ్చు చెప్తారన్నారు.
ఆర్థికంగా తమ కాళ్ల తాము నిలబడ్డ తర్వాతనే ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాతనే.. ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాతనే కానీ.. ఒక పరిశ్రమ పెట్టిన తర్వాతనే కానీ.. మీ అంత మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చే దాకా తొందరపడి పెళ్లిళ్లు చేసుకోవద్దనేది నా మాట. నా సూచన కూడా. మన దేశంలోవాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్లు చేస్తా ఉంటరు.. కానీ తన కాళ్ల మీద తాను నిలబడితే ఒక ఉద్యోగం సంపాదించడం కానీ.. లేదా ఆర్థిక స్వతంత్రం వస్తే ఆ గౌరవమే వేరు.. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్లో మీ ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. భరోసా, సఖి, సీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి, వీహబ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్లో కూడా చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకలలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
గజమాలతో ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు. pic.twitter.com/jkdby3Kjw6
— BRS Party (@BRSparty) March 7, 2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సోషల్… pic.twitter.com/v1lIpwaSRp
— BRS Party (@BRSparty) March 7, 2026