బెంగళూరు: పుట్టిన వారం రోజులకే రెండు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆకలి, దప్పికతో అవి మరణించాయి. (tiger cubs died of starvation) చనిపోయిన రెండు పులి పిల్లల మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కావేరి వన్యప్రాణుల అభయారణ్యంలోని హోలెమురదట్టి బీట్‌లో అటవీశాఖ సిబ్బంది సోమవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత మగ పులి పిల్ల మృతదేహాన్ని కనుగొన్నారు. మంగళవారం అదే ప్రాంతంలోని గుహ సమీపంలో ఆడ పిల్ల మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, ఏడు నుంచి పది రోజుల వయస్సున్న ఈ రెండు పులి పిల్లల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వాటి శరీరంపై ఎలాంటి గాయాలు లేదా విష ప్రయోగ ఆనవాళ్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో తల్లి పులి నుంచి వేరుపడిన ఈ రెండు పులి పిల్లలు ఆకలి, దప్పిక, అలసట వల్ల చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది.
మరోవైపు జూన్ 26నలో మలై మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో ఐదు పులులు చనిపోయాయి. విష ప్రయోగం వల్ల అవి మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో పులుల మృతిపై కేసు నమోదు చేశారు. పలువురు అనుమానిత వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఆవాస భద్రత, వేట వల్ల ఈ అభయారణ్యంలో పులులు మరణిస్తుండటంపై వన్యప్రాణుల సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న పులులను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read:
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో.. 2.17 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు గుర్తింపు
Man Kills Sister After Rakhi | రాఖీ తర్వాత చెల్లిని చంపిన అన్న.. ముందు రోజు ఆమె ప్రియుడ్ని హత్య