లక్నో: చెల్లితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆమెను చంపాడు. (Man Kills Sister After Rakhi) ముందు రోజు తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె ప్రియుడ్ని కూడా హత్య చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గరౌత ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కుమారి సహోదర్ అలియాస్ పుట్టి, లహ్చురాకు చెందిన 19 ఏళ్ల విశాల్ ప్రేమించుకున్నారు. నాలుగు నెలల కిందట వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. అయితే ఇరు కుటుంబాలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చారు. రెండు కుటుంబాల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. దీంతో వారిద్దరూ కొంతకాలం దూరంగా ఉన్నారు.
కాగా, ప్రేమికులైన కుమారి, విశాల్ తిరిగి కలుసుకుంటున్నారు. కుమారి అన్న అయిన 25 ఏళ్ల అరవింద్‌కు ఇది నచ్చలేదు. దీంతో పూణే నుంచి గ్రామానికి తిరిగి వచ్చిన అతడు తన చెల్లి, ఆమె ప్రియుడి హత్య కోసం స్నేహితుడైన 25 ఏళ్ల ప్రకాష్ ప్రజాపతితో కలిసి ప్లాన్ వేశాడు. ఆగస్ట్ 7న ఉద్యోగం పేరుతో విశాల్‌ను తీసుకెళ్లి వారిద్దరూ చంపారు. గుధా గ్రామంలో అతడి మృతదేహం లభించింది. దీంతో విశాల్ తండ్రి ఫిర్యాదు మేరకు అరవింద్, ప్రజాపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు శనివారం అన్న అరవింద్‌కు కుమారి రాఖీ కట్టింది. ఆ తర్వాత మందుల కోసమంటూ ఆమెను ఒకచోటకు తీసుకెళ్లాడు. స్నేహితుడు ప్రకాష్ ప్రజాపతితో కలిసి చెల్లిని హత్య చేశాడు. ఆదివారం చంద్రపుర గ్రామంలోని నిర్జన ప్రాంతంలో గుండుతో ఉన్న కుమారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చెల్లి, ఆమె ప్రియుడు విశాల్‌ను అరవింద్, అతడి స్నేహితుడు ప్రకాష్ కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో.. 2.17 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు గుర్తింపు
Jawan Poisons Daughter | కొడుకు పుట్టలేదని.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి చంపిన జవాన్
Cat Kumar | బీహార్‌లో నివాస ధృవీకరణ పత్రం కోసం.. ‘క్యాట్ కుమార్’ దరఖాస్తు