న్యూఢిల్లీ: 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. (Fake Currency Notes) ఇందులో 1.17 లక్షలకుపైగా కొత్త రూ.500 నకిలీ నోట్లు ఉన్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.23 లక్షలకుపైగా నకిలీ నోట్లను గుర్తించినట్లు తెలిపారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ నోట్లు బయటపడినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా కొత్త రూ.500కు చెందిన 1,17,722 నకిలీ నోట్లు ఉన్నాయని అన్నారు. అలాగే రూ.100 డినామినేషన్లకు చెందిన 51,069 నకిలీ నోట్లు, రూ.200కు చెందిన నకిలీ నోట్లు 32,660 ఉన్నాయని పార్లమెంట్‌కు వెల్లడించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదించి కరెన్సీ నోట్ల భద్రతను సమీక్షిస్తున్నది ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం కొత్త భద్రతా ఫీచర్లు, కొత్త డిజైన్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా నకిలీ నోట్ల కట్టడికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీఐకు సంబంధించిన ఇతర ప్రశ్నలకు కూడా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
Also Read:
Bengaluru Tech Summit | బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్: మంత్రి ప్రియాంక్ ఖర్గే
Jawan Poisons Daughter | కొడుకు పుట్టలేదని.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి చంపిన జవాన్
Cat Kumar | బీహార్‌లో నివాస ధృవీకరణ పత్రం కోసం.. ‘క్యాట్ కుమార్’ దరఖాస్తు
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక మృతి.. ఒడిశాలో నాలుగో సంఘటన