బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ షో జరుగనున్నది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 20 వరకు బెంగళూరు టెక్ సమ్మిట్ (బీటీఎస్) (Bengaluru Tech Summit) 28వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. సోమవారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ సాంకేతిక ఆవిష్కరణ, సహకారంలో బెంగళూరును ఈ టెక్ ఈవెంట్ ముందంజలో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో పెరుగుతున్న స్థాయి, డిమాండ్‌ను తీర్చడానికి బీటీఎస్ 2025ను తొలిసారి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బీఐఈసీ)లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కాగా, బెంగళూరు టెక్ సమ్మిట్‌లో 20,000కు పైగా స్టార్టప్ వ్యవస్థాపకులు, వెయ్యికి పైగా పెట్టుబడిదారులు, 15,000 మందికిపైగా ప్రతినిధులు, 600 మందికి పైగా స్పీకర్లు, 1,200కు పైగా ఎగ్జిబిటర్లు సహా లక్ష మందికిపైగా హాజరవుతారని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఈ ఈవెంట్లో వందకు పైగా నాలెడ్జ్ సెషన్లు, 5,000కు పైగా క్యూరేటెడ్ సమావేశాలు, 60కు పైగా దేశాలు, దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. రాబోయే దశాబ్దాలను రూపొందించే ఆవిష్కరణలు, విభిన్న రంగాల్లో సాంకేతికత పరివర్తన, టెక్ ఎకోసిస్టమ్ వంటి శక్తివంతమైన చర్యలకు బీటీఎస్ 2025 థీమ్ పిలుపునిస్తుందని వెల్లడించారు.
Bengaluru Tech Summit 2025
మరోవైపు సోమవారం ఉదయం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో 200 మంది అగ్రశ్రేణి సీఈవోలతో అల్పాహార సమావేశం జరిగింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025ను అధికారికంగా ప్రకటించడంపై ఈ సందర్భంగా చర్చించారు. నాస్కామ్, ఐఈఎస్ఏ, టీఐఈ బెంగళూరు, ఏబీఎల్‌ఈ, ఏబీఏఐ వంటి ప్రముఖ పరిశ్రమ సంస్థలు, ఐటీ, డీప్ టెక్, బయోటెక్, హెల్త్‌టెక్, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్, డిఫెన్స్, స్పేస్‌టెక్, ఫిన్‌టెక్, ఏవీజీసీలకు చెందిన సీఈవోలు ఈ సదర్భంగా సీఎం సిద్ధరామయ్యతో పలు కీలక అంశాలపై మాట్లాడారు.
Also Read:
Jawan Poisons Daughter | కొడుకు పుట్టలేదని.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి చంపిన జవాన్
Cat Kumar | బీహార్‌లో నివాస ధృవీకరణ పత్రం కోసం.. ‘క్యాట్ కుమార్’ దరఖాస్తు
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక మృతి.. ఒడిశాలో నాలుగో సంఘటన