Passive Euthanasia: 13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి
Passive Euthanasia : సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి వైద్య చికిత్సను నిలిపివేయాలని కోర్టు చెప్పింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి కోర్టు ఆదేశించింది. 32 ఏళ్ల హరీశ్ రాణా అనే వ్యక్తి.. 2013లో బిల్డింగ్ మీద నుంచి కింద పడి కోమాలోకి వెళ్లాడు. అయితే లైఫ్ సపోర్టుపై అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ కేసులో పాసివ్ యుథనేసియాకు కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది.
లైఫ్ సపోర్టింగ్ చికిత్స పొందుతున్న హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో జనవరి 15వ తేదీన కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే హరీశ్ రాణాకు కొనసాగిస్తున్న లైఫ్ సపోర్టు చికిత్సను ఉపసంహరించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ హరీశ్ రాణా కోలుకునే అవకాశం లేదని గతంలో రెండు మెడికల్ బోర్డులు పేర్కొన్నాయి. లైఫ్ సపోర్టు చికిత్సను నిలిపివేయాలని ఆ మెడికల్ బోర్డులు సూచించాయని, ఈ దశలో కోర్టు జోక్యం అవసరం లేదని, కానీ ఇది తొలి కేసు కాబట్టి, కోర్టుకు రిఫర్ చేయాల్సి వచ్చిందని బెంచ్ పేర్కొన్నది. చాలా మార్యాదపూర్వకర రీతిలో లైఫ్ సపోర్టును తొలగించాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది.
పంజాబ్ యూనివర్సిటీలో హరీశ్ రాణా పెయింగ్ గెస్ట్‌గా ఉన్న సమయంలో.. 2013లో నాలుగవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అతనికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. మెదడుకు గాయం కావడం వల్ల అప్పటి నుంచి అతనికి లైఫ్ సపోర్టు చికిత్సను అందిస్తున్నారు. బెడ్ మీద ఉండి అచేతన స్థితిలో చికిత్సను పొందుతున్నాడు. ట్రాకోస్టోమీ ట్యూబ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నాడు. గ్యాస్ట్రోజీజునోస్టమీ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే 13 ఏళ్లుగా చికిత్స వల్ల ఎటువంటి మార్పు జరగలేదని మెడికల్ బోర్డులు రెండు సార్లు చెప్పాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

