‘శక్తి’ వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు!
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను 'శక్తి' శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో..
– పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
– నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది ఏకగ్రీవ తీర్మానం
రామగిరి, ఆగస్టు 13 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు వారు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. సాంకేతిక విద్యాభివృద్ధికి మూలస్తంభమైన పాలిటెక్నిక్ వ్యవస్థను శక్తి శాఖలో విలీనం చేస్తే విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్పై ఆందోళన
ఈ విలీనం వల్ల ఉద్యోగుల సేవా నిబంధనలు, పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగ భద్రత తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. AICTE గుర్తింపు ఉన్న పాలిటెక్నిక్ విద్య ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు.
సాంకేతిక విద్యాశాఖలోనే కొనసాగించాలి
పాలిటెక్నిక్ కళాశాలల స్వతంత్ర గుర్తింపు, విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

