Wildfire | అడవిలో హెలికాప్టర్ కూలి చెలరేగిన కార్చిచ్చు.. వందల ఎకరాలకు నిప్పు.. ఇద్దరు సైనికులు దుర్మరణం..!
Wildfire | అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సైనిక హెలికాప్టర్ (Military helicopter) కూలిపోవడంతో కార్చిచ్చు (Wildfire) చెలరేగింది. మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లో వందల ఎకరాల మేర గడ్డి దగ్ధమైంది. దాంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సైనికులు (TWO Soldiers) మృతిచెందారు.
Wildfire : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సైనిక హెలికాప్టర్ (Military helicopter) కూలిపోవడంతో కార్చిచ్చు (Wildfire) చెలరేగింది. మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లో వందల ఎకరాల మేర గడ్డి దగ్ధమైంది. దాంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సైనికులు (TWO Soldiers) మృతిచెందారు. సాలడో పట్టణం (Salado town) సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇది అత్యంత తీవ్రమైన ఘటన అని బెల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ అని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం వెల్లడించింది. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. కాగా, గురువారం సాయంత్రానికి కార్చిచ్చును 50 శాతం అదుపులోకి తెచ్చినట్లు టెక్సాస్ అగ్నిమాపకశాఖ తెలిపింది. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు యూఎస్ మిలిటరీ అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

