BRS MP Vaddiraju | పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై నోరువిప్పని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు : బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు విమర్శ
BRS MP Vaddiraju | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ తరుఫున తెలంగాణ సమస్యలపై గళమెత్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవీంద్ర వెల్లడించారు.
ఢిల్లీ : పార్లమెంట్ ( Parliament ) వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ ( BRS ) తరుఫున తెలంగాణ సమస్యలపై గళమెత్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవీంద్ర ( BRS MP Vaddiraju ) వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటులో ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యల పైన గొంతెత్త లేదని ఆరోపించారు.
తెలంగాణ రైతులు, ప్రజల సమస్యలపైన గొంతెత్తి, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలపైన బీఆర్ఎస్ తరఫున కొట్లాడామని అన్నారు. తెలంగాణ సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడానికి తెలంగాణ సమాజం ఎదురుచూస్తోందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంఎంటీఎస్ రైలు రెండవ దశ పనులు , సహకార బిల్లుపై తమ వాదనలు వినిపించామని ఎంపీ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

