మెట్పల్లి, సెప్టెంబర్ 26 : అంగన్వాడీ టీచర్ల నుంచి లంచం తీసుకుం టూ మెట్పల్లి సీడీపీవో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి అర్బన్ పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అనుకూలంగా వివరాలు నమోదు చేసేందుకు మూడు నెలలకోసారి రూ.63 వేలు ఇవ్వాలని సీడీపీవో పద్మ డిమాం డ్ చేశారు. ఈ మేరకు శనివారం బాధితుల నుంచి రూ.63 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీడీపీవోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.