హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కాస్త రిలాక్స్ అయ్యారు. నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సుదర్శన్ థియేటర్లో రాత్రి 10గంటలకు(సెకండ్ షో) పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు.
చాలా ఏండ్ల తర్వాత సినిమాకు వెళ్తున్నట్టు థియేటర్‌కు వెళ్లేముందు తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. కేటీఆర్‌తో కలిసి సినిమాను వీక్షించిన వారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.