ఆత్మగౌరవ ధికార స్వరం ఐలమ్మ
తెలంగాణ ఆత్మగౌరవ ధికార స్వరం, తెలంగాణ సోయికి చాకలి ఐలమ్మ నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగ న్యాయమైన హకుల కోసం ధికార స్వరం వినిపించిన ధీర వనిత, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక.. ఐలమ్మ అని కొనియాడారు.
- ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతకు అనుసరణీయం
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆత్మగౌరవ ధికార స్వరం, తెలంగాణ సోయికి చాకలి ఐలమ్మ నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగ న్యాయమైన హకుల కోసం ధికార స్వరం వినిపించిన ధీర వనిత, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక.. ఐలమ్మ అని కొనియాడారు.
నాటి భూస్వాములను ఎదురించి, న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ఆమె ప్రదర్శించిన ప్రజాస్వామిక స్ఫూర్తిని నేటి యువత తరానికి ఆదర్శనీయమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం ఆమె త్యాగాలను స్మరించుకుంటూ, కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రస్తుతం సాగుతున్న అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ప్రదర్శించిన తెలంగాణ సోయి నేటి యువతకు అనుసరణీయమని ఆయన స్పష్టం చేశారు.
ఐలమ్మ స్ఫూర్తితో మలిదశ పోరాటం
శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ పోరాటంలో ఐలమ్మ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నా రు. ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు తమ ప్రభుత్వం, ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సం ప్రదాయాన్ని నెలకొల్పిందని గుర్తుచేశారు.
ఐలమ్మ ఆశయాలకనుగుణంగా తమ ప దేండ్ల పాలనలో మహిళలు, శిశు సంక్షే మం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలుచేశామని గుర్తుచేశారు. ఆ ఫలితాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. తమ పాలనా పద్ధతులను చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారానే మనం ఐలమ్మకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

