బెంగళూరు: ఐదేళ్ల బాలిక 74 మందులు, సౌందర్య సాధనాలను కేవలం మూడున్నర నిమిషాల్లో గుర్తించింది. దీంతో ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. మలేషియాలో నివసించే సుజయ్, ఐశ్వర్య దంపతుల ఐదేళ్ల కుమార్తె సియా (Siya) ఆ దేశంలోనే పుట్టి పెరిగింది. అయితే తాత, అమ్మమ్మలతో రెండు నెలలు గడిపేందుకు కర్ణాటకలోని దావణగెరెకు వచ్చింది.
కాగా, తాత కేవాష్కు చెందిన మెడికల్ స్టోర్‌కు సియా రోజు వెళ్లేది. కస్టమర్లకు తాత ఇచ్చే మందులు, సౌందర్య వస్తువుల పేర్లు గురించి స్వయంగా తెలుసుకున్నది. దీంతో ఐదేళ్ల సియా కేవలం 3 నిమిషాల 30 సెకన్లలో 74 రకాల మందులు, సౌందర్య వస్తువులను గుర్తించింది. అసాధారణ జ్ఞాపకశక్తి, పరిశీలన నైపుణ్యాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనే చోటు సంపాదించింది.
Davangere Girl Siya
మరోవైపు మూడేళ్ల వయస్సు నుంచే సియా రికార్డులు బ్రేక్ చేసినట్లు తల్లి ఐశ్వర్య తెలిపారు. ఐదేళ్ల వయస్సులో ఇన్ని రకాల మందులు, సౌందర్య ఉత్పత్తులను గుర్తించడం చాలా అరుదని అన్నారు. వీటి గురించి సియాకు ఎవరూ నేర్పలేదని, తాత అమ్ముతుండటం చూసి వాటి పేర్లు, వాడకం గురించి తెలుసుకున్నదని చెప్పారు. సియా తొలుత కన్నడతో ఇబ్బంది పడిందని, అయితే రెండు నెలల్లోనే ఆ భాషను సరళంగా మాట్లాడటం నేర్చుకున్నట్లు వెల్లడించారు.
కాగా, అసాధారణ జ్ఞాపకశక్తి, పరిశీలన నైపుణ్యాలు, ఈ అవగాహన భవిష్యత్తులో సియాకు ఎంతో ఉపయోగపడతాయని అమ్మమ్మ దీప ప్రశంసించారు. తమ మనుమరాలు తమకు ఎంతో గర్వకారణమని ఆమె అన్నారు.
Also Read:
Bengaluru Tech Summit | బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్: మంత్రి ప్రియాంక్ ఖర్గే
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో.. 2.17 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు గుర్తింపు
Man Kills Sister After Rakhi | రాఖీ తర్వాత చెల్లిని చంపిన అన్న.. ముందు రోజు ఆమె ప్రియుడ్ని హత్య
Jawan Poisons Daughter | కొడుకు పుట్టలేదని.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి చంపిన జవాన్