Biren Singh Engti | కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి కన్నుమూత.. అసోం సీఎం సంతాపం
Biren Singh Engti : కాంగ్రెస్ వెటరన్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి (81) కన్నుమూశారు. అసోం రాజధాని గుహవటిలో మంగళవారం ఉదయం స్థానిక ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Biren Singh Engti : కాంగ్రెస్ వెటరన్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి (81) కన్నుమూశారు. అసోం రాజధాని గుహవటిలో మంగళవారం ఉదయం స్థానిక ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గతంలో తను ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గమైన దిఫులోని ఆయన నివాసంలో ఇటీవల బిరేన్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు గుహవటి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిరేన్ సింగ్ కన్నుమూశారు.
ఆయన మృతదేహాన్ని సొంత నియోజకవర్గానికి తరలించారు. బిరేన్ సింగ్‌కు దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన అసోంలని, కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, దిఫు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1971, 1977, 1984లో ఎంపీగా గెలవగా, ఆ తర్వాత 2004 నుంచి వరుసగా మూడుసార్లు.. అంటే 2004, 2009, 2014లో ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గానూ సేవలందించారు. బిరేన్ సింగ్ మృతిపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
దీర్ఘకాలికంగా బిరేన్ సింగ్ దిఫు ప్రాంతంలో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా బిరేన్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మరణం అసోం రాజకీయాలకు, ఈ ప్రాంతానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గౌరవ్ గొగోయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన చిన్నతనం అంతా బిరేన్ సింగ్ కుటుంబంతోనే గడిచిందని గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

