Mathew Hayden : పొట్టి ప్రపంచకప్ ముగియడమే ఆలస్యం ఐపీఎల్ హంగామాకు తెరతీసింది బీసీసీఐ. మార్చి 28 నుంచి 19వ సీజన్ ఆరంభం కానుందని భారత బోర్డు ప్రకటించింది. మెగా టోర్నీకి మరో పద్దెనిమిది రోజులే ఉండడంతో ఫ్రాంచైజీలు అన్ని విభాగాలను సరి చూసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకొని దిగ్గజ ఆటగాడిని బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు విధ్వంసక ఆటగాడైన ఆస్ట్రేలియా వెటరన్ మాథ్యూ హేడెన్(Mathew Hayden)కు బాధ్యతలు అప్పగించింది గుజరాత్ యాజయాన్యం.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ప్రారంభ తేదీ రావడమే ఆలస్యం గుజరాత్ టైటాన్స్ జోరు పెంచింది. బ్యాటింగ్ యూనిట్‌ను మరింత సానబెట్టేందుకు మాథ్యూ హేడెన్‌ను కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీ వెల్లడించాడు.
Powerhouse. Legend. Now our Batting Coach 💪
Saying ‘𝗛𝗮𝘆-𝗗𝗼𝘀t’ to @HaydosTweets 👋 pic.twitter.com/J3eE59AzM1
— Gujarat Titans (@gujarat_titans) March 10, 2026
‘గుజరాత్ టైటాన్స్ ప్రయాణంలో మాథ్యూ హేడెన్‌ను కోచ్‌గా నియమించడం చాలా కీలకమైనది. ఫ్రాంఛైజీగా మేము అత్యున్నత ఆటను.. దీర్ఘ కాలిక విజయాలను సాధించాలనుకుంటున్నాం. అందుకే నిరంతరం జట్టును పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తాం. అంతర్జాతీయ క్రికెట్లో హెడేన్ అనుభవం.. మెంటార్‌గా అతడు అందించిన సేవలు గుజరాత్ బ్యాటింగ్ బలోపేతంలో కీలకం కానున్నాయి’ అని సోలంకీ తెలిపాడు.
🚨 IPL UPDATE GT 🚨
• Mathew Hayden will be the batting Coach of Gujarat Titans in IPL 2026…..Seemore pic.twitter.com/UpRGBuonuf
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 10, 2026
తనను గుజరాత్ ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్‌గా నియమించడంపై ఆస్ట్రేలియా వెటరన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేయాలంటే ఒత్తిడి ఉండాలి. అత్యుత్తమ ఆట మ్యాచ్‌ను శాసిస్తుంది. ఈ ప్రమాణాలనే గుజరాత్ టైటాన్స్ జట్టులో పెంపొందించాలని అనుకుంటున్నా’ అని హేడెన్ పేర్కొన్నాడు.
మేటి ఓపెనర్, అత్యుత్తమ ఆటగాడైన హెడేన్ ఆసీస్ వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 273 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 40 సెంచరీల (టెస్టుల్లో30 , వన్డేల్లో 10)తో కలిపి 15,000లకు పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు ప్రాతినిధ్యం వహించాడీ చిచ్చరపిడుగు. వీడ్కోలు తర్వాత కామెంటేటర్‌గా, కోచ్‌గానూ రాణిస్తున్న హెడేన్ కొన్ని రోజులు పాకిస్థాన్ జట్టుకు సేవలందించాడు.

ఇకపై ఈ వెటరన్ ప్లేయర్ గుజరాత్ టైటాన్స్ విజయాల్లో భాగం కానున్నాడు. 2022లో ఐపీఎల్లో అడుగుపెడుతూనే హార్దిక్ పాండ్యా సారథ్యంలో విజేతగా నిలిచిన గుజరాత్.. రెండోసారి మాత్రం ఫైనల్లో తడబడింది. గత సీజన్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన గుజరాత్ ఈసారి గొప్పగా రాణించాలనే పట్టుదలతో ఉంది.