– కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల
కట్టంగూర్, మార్చి 10 : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కట్టంగూర్ సర్పంచ్ శ్యామల తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు శ్వేత, జయంత్, నవ్య, సాయి ప్రదీప్తి, కమల, వెంకటేశ్వర్లు మెడికల్ క్యాంప్‌నకు వచ్చిన వృద్ధులు, గర్భిణీలు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నరేందర్ రెడ్డి, సిహెచ్ రమణ, శ్రీపాద రమేష్, లింగయ్య, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, కళ్లెం నాగేశ్వర్ రావు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.