కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో బోనాల పండుగ ( Bonalu Festival ) ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసం( Ashada Masam ) సందర్భంగా ఆదివారం గ్రామస్తులు మహిళలు, కుటుంబ సమేతంగా కొత్త కుండల్లో బోనాలు తయారు చేసి సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల కుండలను ఇంటి వద్ద నుంచి డప్పు వాయిద్యాల నడుమ కారేపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ,ఎర్రమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ పెద్దలు సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త నాగేశ్వరరావు, పుచ్చకాయల శ్రీనివాసరావు, మొగిలిచర్ల మల్లికార్జున్, పగడాల నాగేశ్వరరావు, రాజేష్, కంసాని నాగరాజు, మల్లెంపాటి శ్రీనివాసరావు,బట్టు మోహన్,బట్టు శ్రీను స్థానిక ప్రజలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.