దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నల్లబెల్లికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్న సందర్భంగా ఆయనకు దారిపొడవునా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. తమ పార్టీ అధినేత తమకు అండగా ఉన్నారంటూ కార్యకర్తలు అభివాదం చేశారు. పలుచోట్ల కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కార్యకర్తలను పలకరించి, ధైర్యం చెప్పారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేట వైపు తరలివచ్చారు. దీంతో నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు బీఆర్ఎస్ శ్రేణుల సందడి కనిపించింది.
కేసీఆర్ కాన్వాయ్ నల్లబెల్లికి చేరుకునే సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్‌ను గ్రామంలోకి అనుమతించకుండా మధ్యలోనే నిలిపివేశారు. కేవలం నాలుగైదు వాహనాలను మాత్రమే గ్రామంలోకి అనుమతించినట్లు సమాచారం. దీంతో మిగిలిన వాహనాల్లో వచ్చిన నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు సాగారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభివాదం.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రోడ్డు మార్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు,… pic.twitter.com/dkl9jytHy1
— BRS Party (@BRSparty) August 9, 2026
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్.. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.