న్యూఢిల్లీ: మోమోలు తిన్న తర్వాత డబ్బులు అడిగినందుకు నేపాల్‌కు చెందిన వ్యక్తిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచారు. (Nepal Momo Seller Stabbed) తీవ్రంగా గాయపడిన అతడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన 28 ఏళ్ల తుల్ బహదూర్ తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఖోడా కాలనీలో నివాసిస్తున్నాడు. రాజ్బీర్ కాలనీ ప్రాంతంలో మోమోలు అమ్మి జీవిస్తున్నాడు.
కాగా, తుల్ బహదూర్ స్టాల్ వద్ద ముగ్గురు బాలురు మోమోలు తిన్నారు. అయితే రూ.20 చెల్లించకపోవడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు బాలురు కలిసి నేపాల్ వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన తుల్ బహదూర్‌ను స్థానికులు తొలుత లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత కారణంగా ట్రామా సెంటర్‌కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఘాజీపూర్ స్టేషన్ పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో మోమోలు అమ్మే నేపాల్ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?