లక్నో: ఒక మహిళ, ఆమె ప్రియుడు ఒక పిజ్జా షాపులో ఉన్నారు. ఆ మహిళ సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చాడు. సోదరి ప్రియుడిపై ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమెను కూడా కొట్టాడు. (Man Slaps Sister, Beats Boyfriend) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. నాగర్ కొత్వాలి ప్రాంతంలో ఉన్న పిజ్జా ఔట్లెట్లో టేబుల్ వద్ద యువతీ, యవకుడు కూర్చొన్నారు. ఇంతలో ఆ మహిళ సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చాడు. ఆగ్రహంతో సోదరి బాయ్‌ఫ్రెండ్‌పై ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ వ్యక్తి, అతడి స్నేహితులు కలిసి సోదరి ప్రియుడ్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు.
కాగా, ఆ పిజ్జా షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Disturbing scenes unfold at Pepper’s Pizza in Hapur Uttar Pradesh where a young couple’s date turned into a nightmare. The girl’s brother wielding an iron rod stormed the café with his friends.
The boyfriend was savagely beaten and the girl was not spared either. The now viral… pic.twitter.com/JjbekVHcVZ
— Arshu (@im__Arshu) August 12, 2025
Also Read:
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?
Lawyer Slaps Dog Lover | సుప్రీంకోర్టు బయట.. కుక్క ప్రేమికుడిని కొట్టిన న్యాయవాది
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?