చెన్నై: యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్‌కు విద్యార్థిని షాక్ ఇచ్చింది. వేదికపై ఉన్న ఆయనను దాటి వెళ్లింది. గవర్నర్ చేతుల మీదుగా కాకుండా వైస్ ఛాన్సలర్ నుంచి డిగ్రీని అందుకున్నది. (Tamil Nadu student snubs Governor) డీఎంకే నేత భార్య అయిన ఆ విద్యార్థిని చర్యకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుధవారం తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం (ఎంఎస్‌యు) 32వ స్నాతకోత్సవ వేడుక జరిగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి నుంచి డిగ్రీలు అందుకునేందుకు విద్యార్థినులు బారులు తీరారు. ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టా స్వీకరించారు.
కాగా, విద్యార్థిని జీన్ జోసెఫ్ అందరిని ఆశ్చర్యపరిచింది. వేదికపై ఉన్న గవర్నర్ రవిని దాటి ముందుకు వెళ్లింది. ఆయన చేతుల మీదుగా కాకుండా గవర్నర్ పక్కన ఉన్న వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ నుంచి డిగ్రీ పట్టా స్వీకరించింది. ఆ తర్వాత గవర్నర్ వైపు తిరిగి ఆయనకు ధన్యవాదాలు చెప్పింది.
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య పెండింగ్ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
PhD student refuses to receive her doctorate from the TN Governor #RNRavi at the convocation.
Manonmaniam Sundaranar Uni PhD student Jean Joseph has refused to receive her Doctorate from the Governor stating that he is acting against the #Tamil language and Tamil people. pic.twitter.com/FNzSRBeB60
— Mugilan Chandrakumar (@Mugilan__C) August 13, 2025
Also Read:
Lawyer Slaps Dog Lover | సుప్రీంకోర్టు బయట.. కుక్క ప్రేమికుడిని కొట్టిన న్యాయవాది
tiger cubs died of starvation | తల్లి నుంచి విడిపోయిన పులి పిల్లలు.. ఆకలి, దప్పికతో మృతి
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?