న్యూఢిల్లీ: దేశ రాజధాని నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలను వెంటనే షెల్టర్స్‌కు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సోమవారం ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు బయట కుక్కల ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. (Lawyer Slaps Dog Lover) న్యాయవాదులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో డాగ్స్ లవర్స్, లాయర్స్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒక కుక్క ప్రేమికుడి చెంపపై న్యాయవాది కొట్టాడు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని వీరిని విడిపించారు. ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది.
కాగా, దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లోని నివాస ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు వెంటనే తరలించాలని అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. డాగ్ షెల్టర్ హోమ్స్‌లో కుక్కలను కట్టడి చేసే వ్యక్తులు, స్టెరిలైజేషన్, వెటర్నరీ నిపుణులు ఉండాలని సూచించింది. అలాగే అక్కడి నుంచి కుక్కలు పారిపోకుండా పర్యవేక్షించేందుకు సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై జంతు ప్రేమికులు, డాగ్ లవర్స్, ఇతర వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సమీక్షించేందుకు సీజేఐ అంగీకరించారు.
#Delhi #WATCH नजारा सुप्रीम कोर्ट के बाहर का है। पेट लवर्स को वकील ने मारा थप्पड़। विडियो वायरल।@SandhyaTimes4u @NBTDilli #viralvideo #DelhiPolice #DogLovers #straydogs pic.twitter.com/6xArXfHFLb
— Kunal Kashyap (@kunalkashyap_st) August 13, 2025
Also Read:
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
tiger cubs died of starvation | తల్లి నుంచి విడిపోయిన పులి పిల్లలు.. ఆకలి, దప్పికతో మృతి