IND vs ENG : పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఇంగ్లండ్ కడదాకా పోరాడిన వాంఖడేలో విజయంతో మురిసింది. జాకబ్ బెథెల్(105) భయపెట్టినా.. బుమ్రా(33-1), పాండ్యా(2-38)లు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పడగొట్టారు. మ్యాచ్ చేజారుతున్న వేళ బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్.. తిలక్ వర్మ పట్టిన క్యాచ్‌లు భారత విజయంలో కీలకమయ్యాయి.
ఉత్కంఠ రేపిన రెండో సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో వాంఖడేలో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ 253 రన్స్ కొట్టిన టీమిండియా.. రికార్డు ఛేదనలో ప్రత్యర్ధి గొప్పగా పోరాడినా 246కే కట్టడి చేసింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ మెరుపులు.. బుమ్రా, హార్దిక్ బౌలింగ్ టీమిండియాను గెలిపించాయి. 7 పరుగులతో విక్టరీ కొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై వరుసగా రెండోసారి సెమీస్‌లో పైచేయి సాధించింది.
Marching towards the #Final 👏
A step away from 𝙂𝙡𝙤𝙧𝙮 🏆#TeamIndia is into the #T20WorldCup finale 🥳Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#MenInBlue | #ENGvIND pic.twitter.com/6BBNkNw2aB
— BCCI (@BCCI) March 5, 2026
చివరి ఓవర్లో 30 రన్స్ అవసరమవ్వగా.. దూబే బంతి అందుకున్నాడు. సెంచరీతో జోరుమీదున్న బెథెల్ క్రీజులో ఉండడంతో అందరిలో ఉత్కంఠ. కానీ, స్ట్రెయిట్‌గా ఆడిన బెథెల్ రెండు పరుగులు తీసే క్రమంలో రనౌటయ్యాడు. అంతే.. భారత ఆటగాళ్లు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. వరుసగా మూడు బంతుల్ని జోఫ్రా ఆర్చర్(19 నాటౌట్) సిక్సర్లుగా మలిచాడు. 240 పరుగులకే పరిమితమైంది. వికెట్ల తేఆతో గెలుపొందిన భారత్ ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.
భారీ ఛేదనలో రెండో ఓవర్లోనే హార్దిక్ పాండ్యా వికెట్ అందించాడు. ఫామ్‌లో లోని ఫిల్ సాల్ట్(5)ను ఔట్ చేసిన అతడు.. బుమ్రా ఓవర్లో హ్యారీ బ్రూక్(7) దొరికిపోయాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్(105) వరుణ్ చక్రవర్తి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. సింగిల్ తీయడమే పొరపాటైంది. ఆ తర్వాతి బంతికే పెద్ద షాట్ ఆడాలనుకున్న బట్లర్‌ను గూగ్లీతో బౌల్డ్ చేసిన వరుణ్ మూడో వికెట్ అందించాడు. కాసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన టామ్ బ్యాంటన్(17).. స్లో బంతికి బౌల్డయ్యాడు. దాంతో.. 95కే నాలుగు వికెట్ల పడ్డాయి. ఆ దశలో విల్ జాక్స్(35) జతగా రెచ్చిపోయాడు. సిక్సర్ల మీద సిక్సర్లు బాదిన ఈ చిచ్చరపిడుగు.. అర్ధ శతకంతో ఆశలు రేపాడు.
— BCCI (@BCCI) March 5, 2026
14వ ఓవర్లో వరుసగా మూడు వైడ్లు వేసినా.. అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్‌తో.. ఈ జోడీని విడదీసి.. 27 బంతుల్లోనే 50 రన్స్ రాబట్టిన.. సామ్ కరన్(18)ను తిలక్ బౌండరీ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. అయినా.. క్రీజులో బెథెల్ ఉండడంతో ఇంగ్లండ్ విజయంపై ధీమాతో ఉంది. కానీ 18వ ఓవర్లో బుమ్రా ఆరు పరుగులు.. 19వ ఓవర్లో 9 రన్స్ ఇచ్చిన పాండ్యా వికెట్ తీశాడు. చివరి ఓవర్లో తొలి బంతికే బెథెల్ రనౌటవ్వగా.. భారత్ విజయం ఖాయమైంది. ఆఖరి మూడు బంతులకు ఆర్చర్(19 నాటౌట్) సిక్సర్లు సంధించగా.. ఇంగ్లండ్ 246కి పరిమితమైంది.
ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై చెలరేగిన సంజూ శాంసన్(89) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టగా.. మిడిలార్డర్లో శివం దూబే(43) ఉతికేశాడు. వరుసగా రెండో అర్ధ శతకంతో భారీ స్కోర్‌కు సంజూ బాటలు వేయగా.. ఇషాన్ కిషన్(39) దూబే మెరుపులతో రాకెట్ వేగంతో పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా(27), తిలక్ వర్మ(21)లు తమమార్క్ విధ్వంసంతో కదం తొక్కగా టీమిండియా 253 పరుగులతో ప్రత్యర్ధికి కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
WE ARE INTO THE FINAL 🥳#TeamIndia win by 7⃣ runs in Mumbai 🙌
Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/C6Yh6ZTd7d
— BCCI (@BCCI) March 5, 2026