కట్టంగూర్, జూలై 29 : కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ గౌడ్ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ కు నిధుల మంజూరు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ప్రతిష్టకు సహకరించాలని ఎమ్మెల్యే విన్నవించారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్ మంజూరు చేసి, విగ్రహ ప్రతిష్ఠకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేను గౌడ సంఘం నాయకులు శాలువాతో సన్మినించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పెద్ది సుక్కయ్య, మాజీ సర్పంచ్ బెజవాడ సరోజన సైదులు, శిగ యాదగిరి, అనంతుల సైదులు, చౌగోని నాగరాజు, చౌగోని వెంకన్న, అనంతుల రమేష్, భూపతి గణేష్, పబ్బు శివ. చౌగోని శంకర్, సున్నపు నాగరాజు, అనంతుల బాలరాజు, పెద్ది గణేష్, నీలం నాగరాజు, వేముల వెంకన్న, తంతెనపల్లి నరేష్, గుణగంటి గిరి, కొప్పు ఆకాశ్, కొప్పు సైదులు, పబ్బు ప్రశాంత్, చెనగోని సాయి పాల్గొన్నారు.